మంచిర్యాల, అక్టోబర్ 8: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే తమ ఫిర్యాదులు, వినతులను వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలను జత చేయాలని సూచించారు.ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, పరిష్కారం అయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ వాట్సాప్ నంబర్ 8500689596, మంచిర్యాల కలెక్టరేట్ వాట్సాప్ నంబర్ 9492123642గా తెలిపారు.










