నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, పంటలపై ప్రభావం, వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం , గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలి.కరువు పరిస్థితులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, రైతులకు అవసరమైన కరువు సహాయ చర్యలు, పంట నష్టానికి తగిన పరిహారం, సాగునీటి సౌకర్యాలు, వ్యవసాయానికి అవసరమైన ఇతర సహాయక చర్యలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దవెత్తును పాల్గొన్నారు.
Home Andhra Pradesh ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది










