నిజామాబాద్

0
2

నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా, బస్‌స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ దసరా షాపింగ్ ఫెస్టివల్ స్టాల్స్‌ను తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం సందర్శించారు.

 

ఈ సందర్భంగా వివిధ స్టాల్స్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులు (సామగ్రి) మరియు వ్యాపార వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

 

అనంతరం ఫెస్టివల్ నిర్వాహకులు శ్రీ ఎర్రం లింగం గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.