🎯తల్లిదండ్రులకు మనవి.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి
దసరా సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనవి. సెలవుల సమయంలో పిల్లలు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర నీటి ప్రదేశాలకు పెద్దలకు చెప్పకుండా వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
పని ఒత్తిడితో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో ఆడుకుంటున్నారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలి. ముఖ్యంగా ఈత రాని పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలి. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా, ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించాలి.
పిల్లల భద్రతే మన బాధ్యత.. వారి భవిష్యత్తే మనకు ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే దసరా సెలవులను పిల్లలు ఆనందంగా, సురక్షితంగా గడిపేలా ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా వ్యవహరించాలని మనవి.
Bharat Aawaz journalist










