Madanapalle: ఆర్యవైశ్యులకు సంబంధించిన స్థలంపై కొందరు కబ్జాదారులు దౌర్జన్యానికి పాల్పడి, స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. తమ భూమి సర్వే నంబర్ 303/1లో ఉందని, అయితే కబ్జాకు ప్రయత్నిస్తున్న వారు 303/2గా చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థలంలో ఉన్న గేట్లను ధ్వంసం చేయడంతో పాటు, తమ సెల్ఫోన్లను లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో కంకనాల గోపాలకృష్ణ, రాజేష్ కృష్ణ, గోవర్ధన్ దాడికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.










