ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు దాడి

0
2

శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు రోకలి బండతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లికి తలపై తీవ్ర గాయమై, అధిక రక్తస్రావం జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ నగర్‌లో తల్లిపై ఆమె కొడుకు రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్పందించిన అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలిపై దాడి జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు చేపట్టే విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.