ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం

0
1

🟠రైతుల సౌకర్యాలే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం!

నందిగామ, అక్టోబర్ 10, bharat aawaz :

రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను శనివారం ఆమె ప్రారంభించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లతో కలిసి ఆమె క్యాష్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీలో రైతులకు అందుతున్న సేవలు, నగదు లావాదేవీలు, సహకార బ్యాంకింగ్ ద్వారా కలుగుతున్న ప్రయోజనాలపై నాయకులు చర్చించారు.నూతన క్యాష్ కౌంటర్ అందుబాటులోకి రావడంతో రైతులు, ఖాతాదారులకు నగదు లావాదేవీలు నిర్వహించడం మరింత సులభతరం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల సేవలను మెరుగుపరచడం ద్వారా రైతులకు స్థానికంగానే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని నాయకులు పేర్కొన్నారు.రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మద్దుకూరి రామారావు, ఇతర సొసైటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సహకార సంఘాల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, రైతులు పాల్గొన్నారు.