వేలంలో ప్రధాని మోదీ జ్ఞాపికలు.. జాబితాలో ఏపీకి చెందిన 18 బహుమతులు.

0
2

ప్రధాని నరేంద్ర మోదీ వివిధ పర్యటనల సందర్భంగా అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వేలానికి ఉంచింది. ఈసారి వేలంలో ఏపీకి చెందిన 18 ప్రత్యేక బహుమతులు కూడా ఉండటం విశేషం. ఈ వేలం ద్వారా సమీకరించిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘నమామి గంగే’ కార్యక్రమానికి విరాళంగా ఇవ్వనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఈ-వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.

 

ప్రధాని మోదీ తన ఏపీ పర్యటనల సమయంలో పలువురు ప్రముఖులు, సంస్థల నుంచి ఎన్నో కానుకలు స్వీకరించారు. వాటిలో 18 బహుమతులను ప్రస్తుతం వేలంలో ఉంచారు. వీటిలో ప్రధాని ఫొటోతో రూపొందించిన ప్రత్యేకమైన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం అందించిన జ్ఞాపిక, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే కళాఖండం, తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే కొండపల్లి ఎద్దులబండి బొమ్మ వంటివి ఉన్నాయి.