మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య హబ్‌గా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

0
6

మంచిర్యాల నియోజకవర్గం: మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం కాలేజ్ రోడ్డులోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులకు వివరించారు.రూ.30 కోట్లతో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ డిపోను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 18కి పెంచడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, మినీ థియేటర్, షాపింగ్ మాల్ తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు.శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం మంచిర్యాలలోని పురాతన శ్రీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ దేవాదాయ శాఖకు చెందిన వాస్తుశిల్పులు, స్థపతుల సూచనల మేరకు ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.