తెనాలి హ్యాండ్ బాల్ పోటీ విజేతలకు బహుమతులు…

0
2

తెనాలి. 70వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ హ్యాండ్ బాల్ అండర్ 14, అండర్ 17 బాలురు రాష్ట్రస్థాయి పోటీలు తెనాలి ఎన్టీఆర్ స్టేడియంలో ఆనందకర వాతావరణంలో ముగిశాయి. మూడు రోజులు జరిగిన ఈ హ్యాండ్ బాల్ పోటీలలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల బాలుర జట్లు పాల్గొన్నారు. అండర్ 14 విభాగంలో గుంటూరు, కడప, చిత్తూరు జట్లు మొదటి 3 స్థానాలు సాధించగా అండర్ 17 విభాగంలో గుంటూరు,నెల్లూరు, చిత్తూరు  జట్టులే మొదటి 3 స్థానాలు సాధించారు. మొదటి సోమవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈ దర వెంకట పూర్ణచందు, జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారులు స్వర్గీయ మేకా సత్యనారాయణ కుమార్తె జాస్తి వినోద లక్ష్మి, మైనేని ప్రసాదు, గుండపనేని కృష్ణయ్య, సుబ్బారావు టోర్నమెంట్ అబ్జర్వర్  శివప్రసాద్ జిల్లా ఎస్టిఎఫ్ సెక్రటరీలు వినాయకుమార్, విజయదుర్గ లు, వ్యాయామ ఉపాధ్యాయులు భక్తుల వెంకటేశ్వరరావు, స్టేడియం ఇన్చార్జి నాగరాజు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతులను రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర పారిస్ తెనాలి వారు స్పాన్సర్ చేశారు.

Venkat…. తెనాలి….