అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయం ఆవరణలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో భాగంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను విక్రయిస్తున్నారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, గోంగూర, గోరుచిక్కుడు, తోటకూర, అరటి వంటి పంటలను రైతులు నేరుగా తీసుకువచ్చి అమ్ముతున్నారు. రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు కావడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలు వినియోగించడం వలన ఆరోగ్యం మెరుగుపడి ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయని, ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తున్నారు. ప్రతి సోమవారం ఈ విక్రయాలు కొనసాగుతాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించి డివిజన్ వరలక్ష్మి, మండల ఇంచార్జి గంగరాజు, ఐసీఆర్పీలు, రైతులు, మండల అధ్యక్షులు, వెలుగు ఏపీఎం, సీసీ, మహిళా పోలీస్, మహిళలు పాల్గొన్నారు.










