కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహణ బిఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ

0
3

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో “జై తెలంగాణ”, “జై కేసీఆర్” నినాదాలు మిన్నంటాయి.

అనంతరం నాయకులు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలన కోసమే కాకుండా ప్రాంతీయ అవసరాల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.