మున్నేరు బ్రిడ్జి వద్ద పారిశుద్ధ్య డ్రైవ్…!

0
3

పట్టణ నిర్మాణానికి అందరూ సహకరించాలి: :కమిషనర్ లోవరాజు

నందిగామ, అక్టోబర్ 11,bharat aawaz :నందిగామ పురపాలక సంఘ పరిధిలోని పట్టణ శివారులో మున్నేరు పెద్ద బ్రిడ్జి వద్ద మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు కాలువలు, వీధులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు.పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, కాలువలు, చెత్త సేకరణ కేంద్రాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.

నందిగామ పట్టణాన్ని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు ..

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.