టిఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ నియామకం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అశోక్ మహాల్కర్, అనుబంధ విభాగాల అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

0
3

🎤ఆసిఫాబాద్, అక్టోబర్ 11 (భారత్ ఆవాజ్ న్యూస్) :తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో డాక్టర్ అశోక్ మహాల్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కీర్మిళ్లా వినోద్ చారి, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి కావెటి సబితా మనోహర్లు ప్రకటించారు.

అదేవిధంగా పార్టీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా కాబట్టి మనోహర్, జాయింట్ సెక్రటరీలుగా మాచర్ల శ్రీనివాస్ (కాగజ్ నగర్), సాయికుమార్ (ఆసిఫాబాద్), యశ్వంత్ రావు ఎన్నిక కాగా, కోశాధికారిగా ఎండి మోసిన్, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ అర్షద్ అను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రాథోడ్ పుష్పలత, జిల్లా స్పోక్స్ పర్సన్ లుగా ఆత్రం వినోద్, శశికళ లను ఎన్నుకోగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా అబ్బూ తాలిబ్, పెండూర్ దర్ము, నైతమ్ తిరుపతి, జే.కరుణాకర్, పెందోర్ దౌలత్, జీవన్లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మరియు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా దుర్గం శ్యామ్ రావు, ట్రేడ్ అండ్ కామర్స్ విభాగం అధ్యక్షులుగా మైనుద్దీన్, సోషల్ మీడియా ప్రతినిధిగా షేక్ ఆదిల్, ఇ బి సి విభాగం అధ్యక్షులుగా జాడి నందకిషోర్, ప్రజా ఉద్యమ కారుల విభాగం అధ్యక్షులుగా చోటులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధినేత్రి ప్రకటించారని పార్టీ జిల్లా అధ్యక్షులు కీర్మిళ్ళా వినోద్ చారి తెలిపారు.