బోయకొండ గంగమ్మను దర్శించుకున్న టీడీపీ యువ నాయకులు.

0
2

అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ అమ్మవారిని తెలుగుదేశం యువ నాయకులు, రాష్ట్ర మాజీ TNSV ఉపాధ్యక్షులు శ్రీ కట్టా దొరస్వామి నాయుడు తన మిత్రబృందంతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించి, సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.