రోలుగుంటలో జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం

0
2

చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ఆత్మీయ సమావేశం సోమవారం చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తరలివచ్చారు.తొలుత పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు రోలుగుంట గ్రామంలో భారీ కవాతు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం, నాయకుల ఐక్యత మధ్య జరిగిన ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి నూతనోత్సాహాన్ని అందించింది.ఈ సందర్భంగా పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకత్వం ప్రజాసేవకు, ముఖ్యంగా ప్రాంత అభివృద్ధికి అంకితమైందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా రోలుగుంట మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల బలాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చామని, నేడు మండలంలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి పవన్ కళ్యాణ్ నాయకత్వం, భరోసాతో రోలుగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని, అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార కార్యక్రమం కింద చోడవరం నియోజకవర్గానికి 502 కోట్లు మంజూరు కావడం మన ప్రాంతానికి ఎంతో శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, కూటమి ప్రభుత్వానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గండి సింహాద్రి, మండల పార్టీ అధ్యక్షులు బలిజ మహారాజు, అల్లు సత్యనారాయణ, హిటెన్సర్ జగన్, వీర మహిళా అధ్యక్షురాలు అనిమిరెడ్డి మహేశ్వరి, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ లాలం నరసింగరావు, సీనియర్ నాయకులు గండి తాతాజీ, పెద్దాడ నాగేశ్వరరావు, కేసరిపూడి శివాజీ, దుంగల బుచ్చిరాజు, దేవాడ రమణ, ద్వారపురెడ్డి రామకృష్ణ తదితర నాయకులతోపాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.