ఏపీ ప్రజలకు కిలో బియ్యం రూ.49, రూ.50కే.. కొత్తగా KNM సన్నబియ్యం అందుబాటులోకి! | AP Rice Price Latest Update 2026

0
1

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న బియ్యం ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా BPT బియ్యం కిలో రూ.49కి, KNM/RNR రకం బియ్యం కిలో రూ.50కి విక్రయించనున్నట్లు సమాచారం.

 

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 12న విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో KNM రకం బియ్యం విక్రయాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్ బస్తాలు అందించనున్నట్లు వివరాలు వెల్లడించాయి.

 

బియ్యం ధరలు ఇలా ఉన్నాయి:

 

BPT సన్నబియ్యం: కిలో రూ.49

KNM/RNR సన్నబియ్యం: కిలో రూ.50

ప్యాకింగ్: 26 కిలోల బస్తాలు