మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. డివిజన్లో కల్వర్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు.ఈ నిధులతో కల్వర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం కలగనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథని జగన్మోహన్ రావు, 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు.










