నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు బయో రిసోర్స్ సెంటర్ వద్ద దొరికే కషాయాలు ద్రావణాలు విత్తనాలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేసి డెమో రూపంలో ఏ కషాయం దేనికి పనిచేస్తుందో తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను రసాయన ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు రైతులందరూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వినియోగించాలని భూమిని ఖాళీగా ఉంచకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మండల డివిజన్ ఇంచార్జి వరలక్ష్మి మండల ఇంచార్జి గంగరాజు ఐసిఆర్పి జ్యోతి టి ఐసిఆర్పి రత్నం ప్రజా ప్రతినిధులు రైతులు డ్వాక్రా సంఘ మహిళలు పాల్గొన్నారు










