నాణ్యతా ప్రమాణాలు పాటించాలి మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

0
2

ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు పొట్టి శ్రీరాములు చౌక్ సమీపంలో జరుగుతున్న సీసీ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ లతో కలిసి వారు పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్‌కు పలు కీలక సూచనలు చేశారు. వార్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, పార్టీ నాయకులు సయ్యద్ నిసార్, దూడల అశోక్, జయరాజ్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.