తెనాలి దేవిచౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్నవ రాత్రోత్సవములు సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు. అమ్మవారి అలంకార దాతలు ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాలం సమయంలో అష్టోత్తర పూజలు జరిపి శ్రీ చక్రార్చన ప్రసాదములతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు. ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావటం వల్ల శ్రీ మహా సరస్వతి దేవి అలంకారము చేసి నారు.భక్తులు తండోపతండాలుగా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ కార్యక్రమాలను దేవస్థాన సేవా సంఘం మరియు అన్నదాన సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకులు శ్రీ నరసింహమూర్తి దర్శనమునకు వచ్చిన భక్తులకు గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేయుచున్నారు.ఈ కార్యక్రమాలన్నీ దేవస్థాన సంఘము అధ్యక్షులు శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు కమిటీ సభ్యులు, అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చివుకుల శివరామకృష్ణ ప్రసాదు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలన్నీ జరుగుటకు ఎంతో కృషి చేయుచున్నారు.










