ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్లో బుద్ధ ధమ్మ బాంధవుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 29న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ నెల అక్టోబర్ 29వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దివస్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను (పోస్టర్లను) బుద్ధవిహార్లో ధమ్మ బాంధవులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ చారిత్రాత్మక 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దివస్ మహోత్సవానికి మండలంలోని, జిల్లాలోని బుద్ధ ధమ్మ అనుయాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయాలని భక్తిపూర్వకంగా మనవి చేశారు. ఈ సమావేశంలో స్థానిక ధమ్మ బాంధవులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










