మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ కాలనీ, కోళ్లబైలు ప్రాంతానికి చెందిన రవి కుమారుడు నవదీప్.. నక్కలదిన్నె తాండాకు చెందిన మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరూ మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై, సీఐ సానుకూలంగా స్పందించి, ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్టప్రకారం కలిసి ఉండవచ్చని తెలిపినట్లు సమాచారం.










