Madanapalle: మదనపల్లె పట్టణంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతిరోజూ వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారిని శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కో అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.










