అన్నమయ్య జిల్లా పుంగనూరులోని బసవరాజా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ వర్గీయులను అడ్డుకునేందుకు టీడీపీ వర్గీయులు నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. గత ఎన్నికల సమయంలో తమను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు## కొత్తూరు మురళి, పుంగనూరు .










