స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దిశానిర్దేశం..!

0
5

🔹 గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం..!

 

🔸కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు..!

 

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు కొండాపురం మండలంలోని గానుగపెంట సెగ్మెంట్, సత్యవోలు సెగ్మెంట్, నేకునాంపేట సెగ్మెంట్లకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థులను ఘనవిజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ విజయాన్ని తమ బాధ్యతగా భావించి ప్రజల్లోకి వెళ్లాలని, గ్రామస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

 

పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలే బలమని పేర్కొంటూ, నాయకులందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

 

ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఐక్యత, క్రమశిక్షణ, నిరంతర ప్రజాసంబంధాలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

 

గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి, తెలుగుదేశం పార్టీ జెండాను గర్వంగా రెపరెపలాడించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు దిశానిర్దేశం చేశారు.