వరికుంటపాడు మండల కేంద్రంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీధర్ రెడ్డి గారు, వరికుంటపాడు మండల కన్వీనర్ శ్రీ చండ్ర మధుసూదన్ రావు గారు, మండలానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం, ఎన్నికల్లో సమష్టి కృషితో ముందుకు సాగడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, నాయకులు మరియు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు.










