అల్లుకోలలో వైసీపీ ప్రచార జోరు.. పలాసలో మెజారిటీ స్థానాలే లక్ష్యం: బి.డి. రావు

0
1

పలాస: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలాస మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పెదంచల ప్రాదేశిక పరిధిలోని అల్లుకోల పంచాయతీలో జెడ్పీటీసీ అభ్యర్థి బమ్మిడి దుర్యోధనరావు (బి.డి. రావు) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పెదంచల ఎంపీటీసీ అభ్యర్థి కొర్ల ప్రశాంతి తరపున ఆమె భర్త కొర్ల బాలకృష్ణతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బి.డి. రావు మాట్లాడుతూ.. ప్రచారానికి వెళ్లిన ప్రతి ఇంట్లో ప్రజలు ఆత్మీయంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని, ఇంటి వద్దకే రేషన్, పెన్షన్లు అందించిన విధానాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికలే కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే ఎన్నికలని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం, పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పలాస జెడ్పీటీసీ స్థానంతో పాటు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని బి.డి. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.