రోలుగుంట మండలంలో ఎన్డీఏ జడ్పిటిసి అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు ఆధ్వర్యంలో బల్జిపాలెం, గుండుబాడు, జగ్గంపేట, జె నాయుడుపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో ఎంపీటీసీ అభ్యర్థులు లాలం అమ్మోజి, పి లోవరాజు, టీడీపీ నాయకులు నరేష్, నర్సింగరావు, కిల్లాడ నాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు ఓటు వేయాలని కోరారు. అనంతరం కిల్లాడ నాయుడు ఇంట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.










