రాత్రి పది గంటల వరకు ఓటర్లతో సత్యం నాయుడు

0
2

 రోలుగుంట మండల జెడ్పిటిసి స్థానానికి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు బుచ్చంపేట ఎంకే పట్నం నిండుగొండ గుర్రంపేట రత్నంపేట రాజన్నపేట గ్రామాల్లో ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు ప్రచారం కొనసాగించారు. చీకటి పడినా బ్రేక్ ఇవ్వకుండా టార్చ్ లైట్ల వెలుగులో ప్రతి వీధి తిరిగి ఓటర్లను కలిశారు. యువతకు ఉపాధి మహిళలకు చేయూత ఇదే నా లక్ష్యమన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర మాజీ అధ్యక్షులు గుమ్ములూరు చంద్రమౌళి పాల్గొన్నారు.