రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు

0
14

🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)

దేశంలో ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, మరియు భారత రాజ్యాంగ పరిరక్షణే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఓట్ బచావో – దేశ్ బచావో ఉద్యమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భాగస్వాములు కావడం గర్వకారణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు సంయుక్తంగా పేర్కొన్నారు. నవంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న మెగా ర్యాలీలో పాల్గొనేందుకు జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం నుండి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల ప్రత్యేక బస్సు ప్రయాణాన్ని వారు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఓటు హక్కు పవిత్రతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం చేస్తున్న వీరోచిత పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ బస్సు ప్రయాణంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క స్వయంగా కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. కార్యక్రమంలో మాజీ బాలేష్ గౌడ్, ఆసిఫాబాద్ రూరల్ మరియు టౌన్ అధ్యక్షులు రాపర్తి మురళి, ఇమ్రాన్, డీసీసీ కార్యవర్గ సభ్యురాలు దుర్గం కళావతి, ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గాలకు చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా స్థాయిలోని వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.