భరత్ ఆవాజ్ న్యూస్ : వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డా. సత్య శారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఫారం-18 దరఖాస్తులను త్వరగా పరిశీలించి, అర్హత ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి, అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.. రిపోర్ట్ జి రాము దుగ్గొండి మండలం










