చెట్టుపల్లి లో జనసేన ఆత్మీయ సమావేశం

0
3

హనర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయాలని ఉమ్మడి విశాఖ జనసేన ఉపాధ్యక్షులు వూడి కల్యాణ చక్రవర్తి పిలుపునిచ్చారు. చెట్టుపల్లి MPTC-1 అభ్యర్థి పసుపులేటి అప్పలనాయుడు, MPTC-2 అభ్యర్థి కోణా మహేశ్వరి, నర్సీపట్నం ZPTC అభ్యర్థి సుకల రవణమ్మలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.