కొత్తగూడెం గణేష్ టెంపుల్ నూతన ఈఓగా అద్దంకి విజయ్ కుమార్!

0
3

కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర దేవస్థానం (గణేష్ టెంపుల్) నూతన ఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అద్దంకి విజయ్ కుమార్. వేదాశీర్వచనం అందించిన పండితులు.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర దేవస్థానం (గణేష్ టెంపుల్) నూతన కార్యనిర్వహణాధికారిగా (గ్రేడ్-1) శ్రీ అద్దంకి విజయ్ కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.

 

దేవాదాయ శాఖ కమిషనర్, హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కేశవాపురంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) కార్యనిర్వహణాధికారి (గ్రేడ్-1)గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్‌కు గణేష్ టెంపుల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది నూతన ఈఓకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.