చింతూరు మండల కేంద్రంలో సమాధులు మాయమైన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. చింతూరు, ఎర్రంపేట రెండు గ్రామస్థులకు చెందిన సమాధులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టి భూమి చదును చేసినట్లు సమాదులకి చెంది కుటుంబ సభ్యులు తెలిపారు. సుమారు 20 సంవత్సరాల పైనుండి తమ పూర్వీకుల సమాధులు ఆ ప్రాంతంలో చేస్తున్నారు. ప్రభుత్వా ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాక ముందు నుంచి సమాధులు చేస్తున్నాం దీనికి కారకులు ఎవరైనా ఎంతటి వారైనా వారిని విడిచి పెట్టేది లేదని, సమాధులను నేలమట్టం చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, పోలీస్ కంప్లైట్, చింతూరు (ఐ టి డి ఏ) పి వో గారికి కంప్లైంట్ చేసినట్లు తెలిపారు.
# Yadagiri










