రోలుగుంట మండలంలో టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, ఎంపిపి అభ్యర్థి పంచాడ రజని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.కొవ్వూరు, రోలుగుంట, కుసర్లపూడి, కొండపాలెం, కొమరవోలు, నిండుగొండ, కే నాయుడుపాలెం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్డిఎ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, గెలిస్తే సేవకులుగా ఉంటామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర, గుమ్ములూరు చంద్రమౌళి, కోలిపల్లి ఈశ్వరరావు, రామకృష్ణ, శ్రీరామ్మూర్తి, బంటు రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.










