స్థూపం బజార్ రోడ్డు సమస్యపై స్పందన.. గుంతల పూడ్చివేతకు చైర్పర్సన్ ప్రత్యేక చొరవ!
వైరా: వైరా మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని స్థూపం బజార్లో రోడ్డు గుంతలమయంగా మారి ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ స్పందించారు.
స్థానికుల నుంచి సమస్యను తెలుసుకున్న ఆమె ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చే పనులు చేపట్టించారు. దీంతో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యపై స్పందించి మరమ్మతు పనులు చేపట్టడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










