కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు ఎస్పీ నితికా పంత్

0
9

ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 2 నుండి నవంబర్ 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ (Police Act) అమలులో ఉంటుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) నితికా పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నిబంధనల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు లేదా ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే పోలీసుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఎస్పీ, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాసంఘాలు పోలీసులకు సహకరించాలని కోరారు.