● ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర వాసి
● అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నెట్‌వర్క్ నిర్వహణ
● చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలింపు
అల్వాల్, నవంబర్2:సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మహారాష్ట్రకు చెందిన సచిన్ గంగారాం మరుతి చవాన్ (36)పై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పదేపదే పాల్పడుతున్న అతడిని డ్రగ్ అఫెండర్‌గా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించేందుకు ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన సచిన్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా గంజాయిని సేకరించి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ, తన అనుచరులు, వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నాడు.
2020 నుంచి 2026 మధ్య తెలంగాణలో మూడు, మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో ఒకటి చొప్పున మొత్తం ఐదు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
గంజాయి సేకరణ, రవాణా, పంపిణీ కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుచరులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కార్యకలాపాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి కూడా విస్తరించాయి.
అతడి వరుస నేరాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారడంతో పాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నందున పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పటాన్‌చెరు పోలీసుల ద్వారా అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ జిల్లా చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
#Sidhumaroju
Alwal










