ఆసిఫాబాద్‌లో ఘనంగా DYFI 47వ ఆవిర్భావ దినోత్సవం

0
24

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్షుడు టీకానంద్ సంఘం జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. వివాదాస్పదంగా మారిన SIR ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

అదేవిధంగా, రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో DYFI స్థానిక నాయకులు, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.