పండుగ వేళా అందని పెన్షన్.. ఆందోళనలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు!

0
8

ప్రతి నెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. నెల మొదలై రోజులు గడుస్తున్నా పెన్షన్‌ జమ కాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పండుగలు సమీపిస్తున్న వేళ కుటుంబ అవసరాలు, మందులు, నిత్యావసరాల ఖర్చుల కోసం పెన్షన్‌పైనే ఆధారపడే వృద్ధులకు ఈ ఆలస్యం మరింత భారంగా మారుతోంది. ప్రతి నెలా సకాలంలో పెన్షన్‌ అందించాల్సిన పరిస్థితుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

సింగరేణి యాజమాన్యం, CMPF అధికారులు స్పందించాలి

ఎన్నో ఏళ్లపాటు బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన విశ్రాంత కార్మికులకు కనీసం నెలవారీ పెన్షన్‌ను సకాలంలో అందించలేరా? ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్‌ జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పండుగల సమయంలోనైనా పెన్షన్‌ కోసం ఎదురుచూసే పరిస్థితి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.