నిజామాబాదు జిల్లాలో ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రీచ్ లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని స్పష్టం చేశారు.










