ఆసిఫాబాద్‌లో తృటిలో తప్పిన ముప్పు షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ వాహనం దహనం

0
3

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక 363వ జాతీయ రహదారిపై బూరుగుడ బి.ఎడ్ కళాశాల సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక టాటా ఏస్ ప్యాసింజర్ వాహనంలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్నిప్రమాదం జరిగింది.

గెడెకర్ రవీందర్‌కు చెందిన ఈ వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే, డ్రైవర్ మరియు ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, మంటలు పెద్దవి కాకముందే వెంటనే వాహనం నుండి కిందకు దిగిపోయారు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్, ప్రయాణికుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.