క్రీడా మైదానంలో సిద్దిపేట పోలీసుల పతకాల వేట.|

0
6

● రెండు క్రీడాంశాల్లో కాంస్య పతకాలు సాధించిన సిబ్బంది

● విజేతలను అభినందించిన సీపీ రష్మీ పెరుమాళ్

అల్వాల్, నవంబర్ 7: హనుమకొండలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిద్దిపేట పోలీస్ సిబ్బంది క్రీడా ప్రతిభ చాటుకున్నారు. ఖోఖో, హ్యాండ్‌బాల్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు.

ఖోఖోలో డి. శ్రావణి, ఎం. సాహితి, టీ. కల్పన, జి. శిరీష పతకాలు సాధించగా, హ్యాండ్‌బాల్‌లో ఎం. సాహితి, సీహెచ్. జ్యోతి కాంస్య పతకాలు అందుకున్నారు.

విజేతలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. క్రీడాకారుల అంకితభావం, జట్టు సమన్వయం, క్రీడాస్ఫూర్తిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

#Sidhumaroju

Alwal