తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నూతనంగా నిర్మించుకున్న ఇళ్లలో లబ్ధిదారులు తమ తొలి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వాల్గోట్ గ్రామంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో టీజీయూఏ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
కొత్త ఇళ్లలో తొలి పండుగను జరుపుకుంటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.










