నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ, రోడ్లపై జనసంచారం పెరగడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.










