“మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ” సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
3

పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ వారి సంతోషాల్లోనూ ప్రజా ప్రభుత్వం భాగస్వామిగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. 

  దీపావళి పండుగను పురస్కరించుకొని శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వల్లెపు శోభ – దిలీప్ ఇంటికి వెళ్లి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లలో పండుగలు జరగాలి, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలి అన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకన్న , తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ ఏఈ తేజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, వివిధ గ్రామాల సర్పంచ్ లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.