కార్యకర్తలే మా బలం.. వారి పోరాటమే మా నిజమైన ఆస్తి.

0
0

కార్యకర్తలే మా బలం.. వారి పోరాటమే మా నిజమైన ఆస్తి!

పత్తికొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడి, నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికల పోలింగ్ వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ జెండాను భుజాన మోస్తూ, కష్టకాలంలోనూ నాయకత్వానికి అండగా నిలుస్తూ, వ్యక్తిగత ఇబ్బందులను సైతం పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పోరాడిన మీ తెగువ, నిబద్ధత, క్రమశిక్షణ ఎప్పటికీ మరువలేనివి.

నాయకులు పదవుల్లో ఉండొచ్చు.. కానీ పార్టీకి అసలైన బలం కార్యకర్తలే! మీలాంటి నిస్వార్థ కార్యకర్తలు ఉండటమే మా ధైర్యం. మీ కష్టం,మీ త్యాగం, మీ పోరాట స్ఫూర్తి మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఈ పోరాట ప్రయాణంలో మన వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ.. మీ ప్రేమాభిమానాలకు, నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం.

మీరు చూపిన అభిమానాన్ని, మీరు చేసిన పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోము. కార్యకర్తల గౌరవం, వారి ఆత్మగౌరవం కాపాడటమే మా బాధ్యత!

 *కంగాటి శ్రీదేవమ్మ గారు*

*పత్తికొండ మాజీ ఎమ్మెల్యే*