● అంబర్‌పేట సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలింపు
● యజమానులు, ఫైనాన్స్ సంస్థలకు ఆరు నెలల గడువు
● క్లెయిమ్ చేసుకోకుంటే బహిరంగ వేలం
అల్వాల్,నవంబర్10:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్ల పక్కన, ఇతర ప్రాంతాల్లో యజమానులు వదిలేసిన 510 ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పోలీసులు గుర్తించారు.
వీటిని అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు తరలించి, చట్టప్రకారం బహిరంగ వేలం వేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నవంబర్ 9న పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
●వాహనాల జాబితా వెబ్సైట్లో
గుర్తించిన 510 వాహనాలకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాహన యజమానులతో పాటు వాటిపై హైపోథికేషన్ హక్కులు కలిగిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా జాబితాను పరిశీలించాలని పోలీసులు సూచించారు.
● ఆరు నెలల్లోగా క్లెయిమ్ చేసుకోవాలి
నోటీసు ప్రచురించిన నవంబర్ 9వ తేదీ నుంచి ఆరు నెలల్లోగా సంబంధిత యాజమాన్య పత్రాలను సమర్పించి తమ వాహనాలపై హక్కులను నిరూపించుకోవాలి. ఇందుకోసం అంబర్‌పేటలోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న డీసీపీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
●గడువు ముగిస్తే వేలం
నిర్ణీత గడువులోగా ఎవరూ తమ వాహనాలపై హక్కులను నిరూపించుకోకపోతే నిబంధనల ప్రకారం బహిరంగ లేదా ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు.
వాహనాల వివరాలను https://malkajgiripolice.telangana.gov.in వెబ్‌సైట్‌లోని సిటిజన్ సర్వీసెస్ విభాగంలో అబాండన్డ్ వెహికల్స్ లింక్ ద్వారా పరిశీలించవచ్చు.
మరిన్ని వివరాలకు 8712662661, 8008338535 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
#Sidhumaroju
Alwal










