సెకండ్‌ ఇయర్ ఫీజు పేరుతో విద్యార్థి సర్టిఫికెట్లు నిలిపివేత.. భవన్స్‌ కాలేజ్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు!

0
4

స్థానం: సికింద్రాబాద్ (లొత్తుకుంట / సైనిక్‌పురి)

సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్ కాలేజ్ (Bhavan’s Sri Aurobindo Junior College, Sainikpuri) యాజమాన్యంపై ఒక విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ (CEC గ్రూప్) చదివిన వేముల వంశీ మొదటి సంవత్సరం ఫీజు కింద కాలేజీకి రూ. 35,000/- చెల్లించాడు. అయితే కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన వ్యక్తిగత సమస్యల కారణంగా అతను సెకండ్ ఇయర్ చదవలేదు.

ప్రస్తుతం వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం కోసం తన ఒరిజినల్ సర్టిఫికెట్లు (10వ తరగతి మెమో మొదలైనవి) మరియు టీసీ (T.C.) ఇవ్వాల్సిందిగా కోరగా.. యాజమాన్యం షాకింగ్ డిమాండ్ తెరపైకి తెచ్చింది. “సెకండ్ ఇయర్ ఫీజు కింద మరో రూ. 45,000 కడితేనే నీ సర్టిఫికెట్లు ఇస్తాం, లేదంటే ఇవ్వబోం” అంటూ తీవ్రంగా బెదిరిస్తున్నట్లు బాధితుడు వాపోతున్నాడు.

బాధితుడి ఆవేదన:

“నేను చదవని సెకండ్ ఇయర్‌కు రూ. 45,000 ఎందుకు కట్టాలి? నా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపితే నా చదువు, నా భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోతాయి. కాలేజీ యాజమాన్యం నన్ను తీవ్రంగా భయపెడుతోంది” అని వంశీ కన్నీటిపర్యంతమయ్యారు.

బోర్డు నిబంధనల ప్రకారం ఇది నేరం:

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) నిబంధనల ప్రకారం.. విద్యార్థి చదవని తరగతికి ఫీజు డిమాండ్ చేయడం, ఒరిజినల్ సర్టిఫికెట్లను బలవంతంగా బందీగా ఉంచడం చట్టవిరుద్ధం.

ఈ అన్యాయంపై బాధితుడు వంశీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు (secy.tsbie@gmail.com, helpdesk-ie@telangana.gov.in) మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి (DIEO) ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. విద్యార్థి భవిష్యత్తును బందీగా పెట్టి వేధిస్తున్న ఈ కాలేజీ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

కాలేజీ వివరాలు: భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్ కాలేజ్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – 500094 (ఫోన్: 040-27117706)

బాధితుడు: వేము వంశీ, CEC (2025-27)